ఆర్మూర్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా హనుమాన్ దీక్షా గురుస్వామి గనవేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా కొండగట్టుకు వచ్చి 600 కోట్లు ప్రకటించి దేశంలోనే హనుమాన్ జయంతి ఎక్కడ గొప్పగా జరుగుతుందంటే కొండగట్టులో జరుగుతుంది అనే విదంగా ఆలయ పరిసరాలు పునర్నిర్మించనుండటం జగిత్యాల జిల్లా ప్రజల హనుమాన్ భక్తుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు కొండగట్టు ఆలయాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టుని అభివృద్ధి చేయడం ఆధ్యాత్మిక వేత్త కేసీఆర్‌కే సాధ్యమని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు హిందువులమని చెప్పి హిందువుల ఓట్లు రాబట్టుకోవడం మాత్రమే దేవుళ్లను వాడుకుంటున్నారని కాని కేసీఆర్ అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి నిజమైన హిందువుగా నిలిచారాని కొనియాడారు.
కార్యక్రమంలో భక్తులు చిలివేరి రాము, సామ లకపతి రెడ్డి, సార్ల జితేందర్ రెడ్డి, సార్ల రాజేశం, ముడంపల్లి మహేష్, రాయికంటి నర్సయ్య, తీట్ల రాజేష్, బొల్లారపు మధు, కంటే అన్వేష్, ఖాసీం, తిరుపతి, నవీన్, రాజేందర్, ప్రజలు పాల్గొన్నారు.