రెంజల్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన పల్లె సాయిలు (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 14వ తేదీన అనారోగ్య కారణంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.