ఆర్మూర్, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య శాఖ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పురుషులకు కుటుంబ నియంత్రణపై అవగాహన పెంచాలని జిల్లా ఉప ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ రమేష్, సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మహిళలనే ప్రోత్సహించకుండా పురుషుల భాగస్వామ్యాన్ని, అర్హులైన అందరూ కుటుంబ నియంత్రణ పరీక్షలు జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విద్య బోధకులు గన్‌పూర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది నయన్ మురళి, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.