కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి దేవునిపల్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించడం జరిగిందని దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్ఐ సూచించారు.