రెంజల్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పంటను దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేక విజయ సంతోష్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మొయినోద్దీన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండిరచిన శనగ పంటను దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని శనగలను విక్రయించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.5335 రూపాయలను అందిస్తుందని ఈ సదవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించి లాభాలను ఆర్జించాలని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ కుమార్, రైతుబందు జిల్లా డైరెక్టర్ మౌలానా, నీలా సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్, సీఈఓ రాము, డైరెక్టర్లు సుధాకర్, నారాయణ, సాయరెడ్డి, కందకుర్తి ఎంపీటీసీ అసాద్ బేగ్, బొర్గం ఉపసర్పంచ్ ఫెరోజ్, బిఆర్‌ఎస్ నాయకులు ధనుంజయ్, సాయరెడ్డి, సిద్ద పోశెట్టి, రైతులు భూమారెడ్డి, మెత్రి రాజు తదితరులు ఉన్నారు.