రెంజల్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో మంగళవారం ఘనంగా వీరభద్రుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. శివరాత్రి అయిన మూడవ రోజున వీరభద్రుని జాతర ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ రాతి బండరాళ్ల మధ్య వెలిసిన వీరభద్రుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రోచ్ఛారణాలు,బజా భజంత్రీల మధ్య రథోత్సవాన్ని ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతరకు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ బైండ్ల రాజు అన్ని ఏర్పాట్లు చేశారు.