కామారెడ్డి, ఫిబ్రవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తం తెలంగాణ రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లవేళలా అందజేయడం జరుగుతుందని, రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని రక్తదానం పట్ల అవగాహనను పెంపొందించుకొని ప్రాణదాతలు కావాలని అన్నారు.