గాంధారి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు సోషల్ అవేర్నస్ కల్గివుండాలని ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిరది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను స్టేట్ టీం సందర్శిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండలంలోని జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలను సందర్శించిన రాష్ట్ర కమిటీ విద్యార్థులతో మాట్లాడారు.
రాష్టంలో విద్యాశాఖ నూతనంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో సోషల్ అవేర్నస్ గురించి తెలుసుకున్నారు. ప్రైమరీ స్థాయిలో విద్యార్థులకు చదవడం, రాయడంతో సమాజంలో జరుగుతున్నా విషయాలు తెలియాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని సభ్యులు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల పరీక్షలకు మానసికంగా సిద్ధం కావాలని సూచించారు. మంచి మార్కులతో పాఠశాలకి పేరు తేవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవ్ కుమార్, చక్రధర్, కిషన్ రావు, జిల్లా ఏఎంఓ వేణు శర్మ తదితరులు ఉన్నారు.