కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

గాంధారి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రాగా వాటితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని శక్తి కేంద్రాలలో నిర్వహించిన కార్నర్‌ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్బంగా మండలంలోని సితాయిపల్లి గ్రామంలోని 40,41,42 బూత్‌ కేంద్రంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఎల్‌ఈడి లైట్లు, రైతు వేదికలు, డంపింగ్‌ యార్డ్‌ లాంటి అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజురు చేస్తుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆ నిధులను కూడా సర్పంచ్‌లకు తెలియకుండా దారి మళ్లీస్తున్నాడని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మా ద్వారానే పనులు జరుగుతున్నాయని ప్రగల్బాలు పలకడం సిగ్గు చేటని అన్నారు. రాబోయే ఎన్నికలలో కెసిఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. బీజేపీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. కార్యకర్తలు సైనికులాల కస్టపడి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడానికి కృషి చేయాలనీ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబాబా, నాయకులు అంజాద్‌ ఖాన్‌, శ్రీకాంత్‌, భైరవ ప్రసాద్‌, నాందేవ్‌, సుమన్‌, పండరి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »