గాంధారి, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల పరిధిలోని గండివెట్ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు.
అదే విధంగా వరిలో పొట్ట దశలో పొటాష్ ఎరువులు వాడితే తెగులు తట్టుకునే శక్తి తో పాటు గింజ నాణ్యత పెరుగును కావున రైతులు ఎకరాకు 25 కేజీల పొటాష్ లేదా 0.0.50 పోటాష్‌ను ఎకరానికి ఒక కేజీ పిచికారి చేసి మంచి పలితం పొందవచ్చని సూచించారు. పొట్ట దశలో కాండం తొలుచు పురుగు నివారణకు రెండో దశ యూరియా మరియు పొటాష్ వేసిన తర్వాత కార్టాప్ హైడ్రో క్లో రైడ్ 50 శాతం ఎస్‌పి 400 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాన్ ట్రనిలిప్రోల్ 18.5 శాతం ఎస్‌సి 60 మీ లి ఎకరానికి వాడి మంచి పలితం పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, రైతులు, ఏఈఓ గాయత్రి పాల్గొన్నారు.