ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, 76 ప్రభుత్వ జి.ఓ. ల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, పోడు భూములు, ఆయిల్‌ పామ్‌ సాగుపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐడిఓసి నుండి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా అటవీ అధికారి నిఖిత, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ హాజరయ్యారు. సి.ఎస్‌. శాంతి కుమారి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు లేకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, ఆబాది గ్రామకంఠం, శిఖం, వక్ఫ్‌, దేవాదాయ భూముల మొదలగు వివరాలను ప్రోఫార్మా 1 ప్రకారం సేకరించామని, సదరు భూమి క్రమబద్ధీకరణ చేసేందుకు గల అవకాశం, ప్రాతిపదిక, అనుసరించాల్సిన విధానంపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్‌లకు సీఎస్‌ సూచించారు.

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59 ప్రకారం ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం, ఆబాది మొదలగు కారణాల వల్ల హోల్డ్‌ లో పెట్టిన దరఖాస్తులు మరోసారి పరిశీలించాలని, ప్రొఫార్మా 1 ప్రకారం సేకరించిన సమాచారం, సదరు దరఖాస్తులను సరిచూసుకోని నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సీఎస్‌ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 25 పని దినాలలో 51.86 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించామని, జిల్లాలకు చేరే ప్రిస్క్రిప్షన్‌ కళ్ళద్దాల పంపిణీ పూర్తి చేసి వివరాలు ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేయాలన్నారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు శిబిరాలను పర్యటించి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వేసవి దృష్ట్యా క్యాంపుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సూచించారు. జిల్లాలో కంటి వెలుగు అమలు సంబంధించి కలెక్టర్‌ల నుండి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ మినహాయించి పట్టణాలలో నిర్మాణం పూర్తి చేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం మరో 21 వేల 787 లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందని, జిల్లా కలెక్టర్‌లు ప్రత్యేక చొరవ తీసుకొని త్వరితగతిన లబ్దిదారులను ఎంపిక చేసి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, ఈ ప్రక్రియ మరో వారం, పది రోజుల్లో పూర్తి చేయాలని సీఎస్‌ అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తుల పట్టా సర్టిఫికెట్‌ లను సిద్దం చేసామని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు సమయం తీసుకొని వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 ప్రకారం పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 క్రింద అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారుల నుంచి క్రమబద్దీకరణ రుసుము విడతల వారిగా వసూలు చేయాలని, మొదటి విడత సేకరణ కు చర్యలు తీసుకోవాలని అన్నారు. జీఓ 59 కింద రుసుము పూర్తి స్థాయిలో చెల్లించిన దాదాపు 1,450 దరఖాస్తులు పట్టాలను స్థానిక ప్రజాప్రతినిధులసమక్షంలో పంపిణీ చేయాలన్నారు. జీఓ 59 కు సంబంధించి రుసుము మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో చెల్లింపులు సేకరించి పట్టాల పంపిణీ పూర్తి చేయాలన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 76 క్రింద అధికారులు పెండిరగ్‌ దరఖాస్తుల స్క్రూటినీ 3 రోజుల్లో పూర్తి చేయాలని, త్వరితగతిన రుసుము వసూలు చేసి మార్చి 20 నాటికి పట్టాల పంపిణీని పూర్తి చేయాలని సీఎస్‌ అన్నారు. పోడు భూముల పంపిణీ సంబంధించి జిల్లా స్థాయి కమిటీ వద్ద పెండిరగ్‌ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, జిల్లాలో ఆమోదించిన పోడు పట్టా వివరాలను డౌన్‌ లోడ్‌ చేసి ఒకసారి సరి చూసుకోని పట్టా పాస్‌ పుస్తకాలు ముద్రణ చేయాలని సీఎస్‌ సూచించారు.

ఆయిల్‌ పామ్‌ సాగు క్రింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను మార్చిలోగా పూర్తి చేయాలని, జిల్లాలో ఎంపిక చేసిన భూములలో వెంటనే ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటాలని, సంబంధిత భూముల డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎస్‌ అన్నారు. తెలంగాణకు హరితహారం క్రింద వచ్చే సీజన్‌లో నాటే మొక్కలు స్థానికంగా నర్సరీ నుంచి సిద్దం చేసుకోవాలని, దీనికి సంబంధించి అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని సీఎస్‌ అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »