ఆర్మూర్, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటుంది కాబట్టి హిమగ్లోబిన్ అధికంగా ఉండేటట్లు క్యారెట్ బీట్రూట్ కోడిగుడ్డు పల్లి పట్టిలు బెల్లంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యురాలు సూచించారు.
కార్యక్రమంలో 26 మంది గర్భిణీలను పరీక్షించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పిహెచ్‌ఎన్ సుగుణ, స్టాఫ్‌నర్స్‌లు తరంగణి, కల్పన, ఆరోగ్య కార్యకర్తలు ఎస్తేరు రాణి సుల్తానా, విజయ, హిమజ, గర్భిణిలు పాల్గొన్నారు.