క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు.

కాగా లింగాపూర్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ వేద ప్రకాష్‌ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.

వీరితో పాటు పట్టణ కేంద్రానికి చెందిన అతీష్‌ జైన్‌ కూడా ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేశారు. రక్తదానికి ముందు వచ్చిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »