కామారెడ్డి, ఫిబ్రవరి 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నామని కామారెడ్డి రిజిస్ట్రార్ శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నియమాలను అనుసరించి రిజిస్ట్రేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఫీజులు వసూళ్లు చేస్తున్నామని ఎలాంటి రుసుము అదనంగా వసూళ్లు చేయడం లేదని తెలిపారు. కొంతమంది వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయాలని తమపై ఒత్తిడి తీసుక వచ్చి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, తమపై దుష్ప్రచారాం చేయవద్దని కోరారు. విఎల్‌టి చార్జీలు మున్సిపల్ అధికారులు మాత్రమే వసూళ్లు చేస్తారని తెలిపారు. నియమ నిబంధనలు అనుగుణంగా చేస్తుంటే కొంతమంది తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎవరి మాయ మాటలు ప్రజలు నమ్మవద్దని, నేరుగా కార్యాలయంలో తమ రిజిస్ట్రేషన్లు సాఫీగా చేసుకోవాలని సూచించారు.