కాలేశ్వరం నీటితో నిజాంసాగర్‌ ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది…
సీఎం కేసీఆర్‌

బీర్కూర్‌, మార్చ్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం హెలికాప్టర్లో బాన్సువాడ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ వెంకటేశ్వర క్షేత్రానికి వాహనాలలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు వరప్రదాయని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎల్లప్పుడు జలకళతో నిండి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతులకు భరోసా కల్పించారు.

బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ తిమ్మాపూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అష్టమ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సతీసమేతగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో కేసీఆర్‌ దంపతులతో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం చేరుకున్న సీఎం, రెండు కిలోల బంగారు కిరీటాన్ని భక్తులు విరాళాలతో తయారుచేసిన కిరీటాన్ని శ్రీవారికి బహుకరించారు. అనంతరం శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొని శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి, కుటుంబ పెద్దలుగా సీఎం కేసీఆర్‌ దంపతులు, సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు నిలబడి వారిని ఒకటి చేశారు. అరగంటసేపు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల గోవిందా.. గోవిందా నామస్మరణ మధ్య శ్రీవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది.

కళ్యాణంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ అతిథి గృహం వద్ద నిర్వహించిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు రైతులకు అన్నం పెట్టే నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పటికీ ఎండనివ్వకుండా పూర్వ వైభవం తీసుకువస్తానని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. సింగూర్‌ ప్రాజెక్టులోకి, కాలేశ్వరం జలాలను తీసుకువచ్చి ఆ నీటితో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిండుకుండలా ఉంచుతానని సీఎం అన్నదాతలకు భరోసా కల్పించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసి అందరి సహకారంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. ఇకనుంచి తెలంగాణ వనరులన్నీ తెలంగాణ ప్రజలకే చెందుతాయని ఈ సందర్భంగా వెల్లడిరచారు. తెలంగాణను ఎడారిగా మార్చకుండా పచ్చని పంటలతో కళకళలాడాలని ఉద్దేశంతో లక్ష కోట్లు వెచ్చించి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని, ఇక తెలంగాణకు సాగునీటి డోకా ఉండదని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు.

తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు జలకలతో నిండి ఉంటాయని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఆ శ్రీవారి దయ తెలంగాణ ప్రజలపై, రైతులపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడి అన్నదాత ఇళ్లల్లో ధాన్య రాశులు నిండి ఉండాలని ఆ భగవంతున్ని సీఎం వేడుకున్నారు. ఒక పెద్ద మనిషిగా సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన నియోజకవర్గం అభివృద్ధికి ఎప్పుడు శ్రమిస్తూ, అవసరమైతే చిన్న పిల్లాడిలా తన వద్దకు నిధుల కోసం అడుగుతారని నిధులను తీసుకువచ్చి తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నారని, ఈ వయసులో సభాపతి తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒకవైపు పేదల సమస్యలు, మరోవైపు రైతుల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి సాధిస్తూ ముందంజలో ఉన్న సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడూ మర్చిపోరని ఈ సందర్భంగా కేసీఆర్‌ వెల్లడిరచారు.

సభాపతి స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు సాలంబిన్‌ అలీ మరణించిన వార్త తెలియగానే ఎంతో చలించిపోయారని వెంటనే ప్రభుత్వ హెలికాప్టర్‌ను తీసుకొని వెళ్ళమని చెప్పడం జరిగిందని, దీంతో ఆయన స్నేహితుల పట్ల ప్రజల పట్ల ఎంతో నిబద్ధత ఉంటారని అర్థమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి తెరాస పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక సమయంలో నేను బాన్సువాడ వస్తున్న సమయంలో గాంధారి ప్రాంతంలో కొంతమంది గిరిజనులు కలవడం జరిగిందని దీంతో రైతులను ఏమి పంటలు వేస్తారని అడగడంతో కావేరి 15 మొక్కజొన్న పంటను పండిరచడం జరుగుతుందని వారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మూడు నాలుగు ఊర్లకు ఒక సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయడంతో పంటలు పండిరచుకుంటున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేశారని సిఎం గుర్తుచేశారు.

రైతాంగం లబ్ధి చేకూరుతే రైతుల కుటుంబాలు సంతోషంగా ఉంటాయని సిఎం అన్నారు. రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర అందడానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్వయంగా మారుమూల గ్రామాలకు వెళ్లి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, సమయం దొరికినప్పుడల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ జరుపుతూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని సభాపతికి సందర్భంగా అభినందించారు. ఎప్పుడు తన నియోజకవర్గ సమస్యలపై తన వద్ద చర్చించి నిధులు తెచ్చుకుని వాటిని అక్రమ బాట పట్టకుండా సద్వినియోగం చేసుకుంటూ బాన్సువాడ నియోజకవర్గాన్ని ఉమ్మడి జిల్లాలోని కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండడానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేస్తున్న కృషి అద్భుతం అంటూ సీఎం ఈ సందర్భంగా పోచారం సేవలను గుర్తించారు.

ఇటీవల జాతీయస్థాయిలో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి జాతి అవార్డు వచ్చిందని దీనికి సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి కృషి ఎనలేని అన్నారు. బాన్సువాడ ప్రజలకు సేవ చేయాలంటే నాతోపాటు మీరు ఉండాలన్నారు.బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధుల ద్వారా 50 కోట్ల రూపాయలు సీఎం మంజూరు చేశారు. అంతేకాకుండా శ్రీవారి ఆలయంలో మిగిలిన కొన్ని పనులు అభివృద్ధికి సీఎం ఏడు కోట్ల రూపాయలను నిధులను మంజూరు చేయడమే కాకుండా, శ్రీవారి ఆలయానికి చుట్టూ ఉన్న 66 ఎకరాల భూమిని ఆలయ పరిధిలోకి తీసుకురావాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బాన్సువాడ మట్టిలో పుట్టిన సభాపతి పోచారం ప్రతి గ్రామము యొక్క సమస్యలను అర్థం చేసుకునే స్వభావం గల వ్యక్తి కావడం వల్ల తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకుంటూ ముందుకు పోతున్నాడని ముఖ్యమంత్రి అన్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తిరుమల దేవస్థానం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫలితమేనని, సీఎంను ఈ సందర్భంగా అభినందించారు. అడిగిన వెంటనే ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు 23 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వల్ల ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నామని సభాపతి పోచారం వెల్లడిరచారు.

శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. సభాపతి దంపతులు, కెసిఆర్‌ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, శాల్వాతో సన్మానించి బహుకరించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు వరప్రదాయని అయినా నిజాంసాగర్‌ ప్రాజెక్టు వైభవం కోల్పోవడంతో, సాగునీరు అందక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోఎన్నో ఉద్యమాలు చేసినట్లు సభపతి గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో 570 మీటర్ల ఎత్తులో ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి కొండ పోచమ్మ చెరువుకు నీళ్లు అందించి ఆ నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి మళ్లించడం వల్ల, నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పూర్వం వైభవం కలిగిందని దీనికంతటికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని ఈ సందర్భంగా సీఎం చేసిన కృషిని సభాపతి ప్రశంసించారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద రెండు పంటలు పండిరచుకునేందుకు సాగునీటి డోకా లేకుండా చేసిన ఘనత మన సీఎం కే దక్కిందని సభాపతి వెల్లడిరచారు. అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలని లక్ష్యంతో తాను కోరిన వెంటనే 11 వేల ఇండ్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో 7 వేల ఇండ్లు నిర్మించి నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు.

నిజాంసాగర్‌ నీళ్లు అందని ప్రాంతమైన సిద్ధాపూర్‌, చందూర్‌, జాకోరా ప్రాంతాలకు నీటిని అందించడానికి నిధులు కావాలని కోరిన వెంటనే సిద్ధపూర్‌ రిజర్వాయర్‌ 150 కోట్లు, జాకోర ఎత్తిపోతల పథకానికి 120 కోట్లు సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారని, పనులు చురుకుగా సాగుతుందని సభాపతి గుర్తు చేశారు. బాన్సువాడ నియోజకవర్గానికి సాగునీటి పథకాల కోసమే సీఎం 1200 కోట్ల రూపాయలను మంజూరు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నియోజవర్గంలో రెండు పడక గదుల నిర్మాణం కోసం కేటాయించారని, రహదారి రోడ్ల నిర్మాణం కోసం 300 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కె దక్కిందని ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన నిధుల ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి ఏటా రెండు పంటలు పండిరచుకుంటూ 1500 కోట్ల రూపాయల పంటను పండిస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని సభాపతి ఈ సందర్భంగా వెల్లడిరచారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగంలో పురోగతి సాధిస్తుందని ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు.

కార్యక్రమంలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు బీగాల గణేష్‌, సురేందర్‌, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే, గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, కె అర్‌ సురేష్‌ రెడ్డి , నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్లు దాదన్నగారి విట్టల్‌ రావు, దఫెదర్‌ శోభ, ఎమ్మెల్సీలు గంగాధర్‌ గౌడ్‌, నర్సారెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా ఎస్పీ బండ శ్రీనివాస్‌ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దిన్‌,ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, నియోజవర్గం సీనియర్‌ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ద్రోణవల్లి సతీష్‌, ద్రోణవల్లి అశోక్‌, రాంబాబు, ఎంపీపీ రఘు, జెడ్పిటిసి సభ్యురాలు స్వరూప, తిమ్మాపూర్‌ సర్పంచ్‌ రమాకుమర్‌ పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »