కామారెడ్డి, మార్చ్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో స్వాతిక్ అనే విద్యార్థి యజమానుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి మృతికి కళాశాల యజమాన్యం బాధ్యత వహించాలని అలాగే కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండయని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన చెప్పడం జరిగింది, ఇప్పటికీ అనేక వేధింపులతో విద్యార్థినిలు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ ఆత్మహత్యలకు కళాశాల యజమాన్యాలు బాధ్యత వహించాలని చనిపోయిన విద్యార్థిని విద్యార్థులకు 50 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కళాశాలలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాంచులను గుర్తింపులను రద్దు చేయాలని వారన్నారు.
కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు శివప్రసాద్, ఎల్ సంపత్, రిత్విక్, అరవింద్, జస్వంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. అరెస్టు చేసిన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.