ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి విజయం పట్ల సంబరాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఈరోజు వెలువడిన ఫలితాల్లో బిజెపి అఖండ విజయం సాధించడం పట్ల నిజామాబాద్‌ న్యాయవాదుల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ముందర టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్తు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని దీనికి నిదర్శనం గురువారం వెలువడిన ఈశాన్య రాష్ట్రాల త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికల ఫలితాలే అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికై భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను అక్కడి ప్రజలు స్వీకరించి బిజెపికి ఓట్లు వేసి అఖండ విజయాన్ని అందించినటువంటి మూడు రాష్ట్రాల ప్రజలకు పార్టీ కార్యకర్తలకు లీగల్‌ సెల్‌ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రాబోవు లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు.

అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్‌, న్యాయవాదులు నరేందర్‌ రెడ్డి, బిట్ల రవి, రామకృష్ణ నారాయణదాసు బాలరాజ్‌ నాయక్‌, కేశవులు శాస్త్రి, టీఎం శ్రీధర్‌, మంజు సింగ్‌, లక్ష్మీనారాయణ, సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »