కామారెడ్డి, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో ఒకే జండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధానమంత్రి ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రుచే విభేదించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి భారతీయ జనసంఫ్‌ు పార్టీని స్థాపించిన వారిలో ముఖ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని పాదయాత్ర చేస్తున్నప్పుడు నాటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు అనుమానాస్పద స్థితిలో జైలులో చనిపోయాడని అన్నారు.
కాబట్టి జాతీయవాదం కోసం పరితపించి దేశం కోసం చనిపోయిన మహనీయుని చనిపోయిన రోజును బీజేపీ బలిదాన్ దివస్‌గా జరుపుతుందన్నారు. ఆయన కలలు కన్న కాశ్మీర్ అంతర్భాగ విషయం నేటి ప్రధాని మోదీ 370 ఆర్టికల్ రద్దు చేసి భారత్‌లో ఒకే జండా, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని విధానాన్ని చేసి చూపించారని అన్నారు. ఆయన చూపిన బాటలో నేటి బీజేపీ కార్యకర్తలు జాతీయవాదమే ఊపిరిగా, సంఘటితంగా ఉండి ముందుకు సాగాలన్నారు.