ఆర్మూర్, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్ వెంకటేష్ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హుమేర యాస్మిన్, హెచ్ ఎన్ సుగుణ, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, గుండ గణేష్, అరుణ, కవిత, డాటా ఎంట్రీ ఆపరేటర్ మీరాబాయి, ఆప్తమెట్రిస్ట్ కార్తిక్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.