కామరెడ్డి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్ ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
44 నెంబర్ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్‌లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరణి టౌన్షిప్ లో మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. వేలంలో పాల్గొనేవారు రూ. 10,000 కలెక్టర్, కామారెడ్డి పేరిట ఈఎండి చెల్లించాలని సూచించారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం, కల్వర్టుల నిర్మాణం, రక్షణ గోడ నిర్మాణం పనులు చేపడతామన్నారు.
15 రోజుల్లో పనులను పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. డిటిసిపి లేఔట్ కలిగిన ప్లాట్లు, గృహాలను ఎన్నారైలు కొనుగోలు చేయవచ్చని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రాజీవ్ స్వగృహ ఏజిఎం సత్యనారాయణ, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.