నిజామాబాద్, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తల్లి కూతురు ఆత్మహత్యకు పాల్పడిరది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ దారుణానికి పాల్పడిరది. భర్త మరణించడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో కలిసి అపార్ట్మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిరది. ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన జటాల అనుష, తన ఏడాది కూతురు శ్రీకృతి, మరో మూడేళ్ల కూతురుతో కలిసి ఆమె పెదనాన్న పెద్దమ్మలను కలిసేందుకు నెల క్రితం నగరానికి వచ్చింది. కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో గల సాయి ఆర్కెఆర్ అపార్ట్మెంట్లో పెద్దమ్మ పెదనాన్నతో ఉంటుంది. మృతురాలి భర్త శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు. భర్త మృతితో అనూష తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో జీవితంపై విరక్తి చెంది తన ఏడాది కూతురు శ్రీకృతితో కలిసి అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో అనూష మృతి చెందగా ఏడాది కూతురు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటన స్థలానికి రూరల్ టౌన్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.