మాక్లూర్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం చిక్లీ గ్రామాంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కొరకు గ్రామస్తులు స్థల పరిశీలన చేశారు. చిక్లీ శివార్లో గల సర్వే నంబర్ 134 లో 4 ఎకరాలను సర్వేయర్ శ్రీనివాస్ సర్వే చేసి హద్దులు చూపించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తమ గ్రామాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు త్వరగా నిర్మించి లబ్ధిదారులకు అందజేయాలనీ కోరారు. రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో లాగానే ఏ విదంగా మెజార్టీ అందించామో అదే విదంగా భారీ మెజార్టీ అందిస్తామని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, ఉపసర్పంచ్ గుండు రవి, ఎంపీటీసీ సుజాత నవీన్, భారస మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు షేర్ ఖాన్, భోజన్న, గ్రామస్తులు ఎర్రన్న, రాజు, సాయిలు, లాల్ ఖాన్, వీఆర్ఏలు సాగర్, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.