మోర్తాడ్, జూన్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ప్ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సామాజిక సేవకులు చాంద్ పాషా అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లిన వలస కూలీలు వివిధ కారణాలతో మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చే అవకాశం ఉందన్నారు.
1983 ఇమ్మిగ్రేషన్ చట్టం అనేది గల్ఫ్ బాధితులకు ఒక వరం భరోసా లాంటిదని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా చాలా మంది గల్ఫ్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు ఆర్థిక లబ్ది పొందే అవకాశం ఉంటుందని చాంద్ పాషా అన్నారు. ఎవరైనా సరే గల్ఫ్‌కు వెళ్లే ఉపాధి కార్మికులు లైసెన్సులు గల ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారానే వెళితేనే ఈ చట్టం వర్తిస్తుందన్నారు. వివిధ గ్రామాలలోని ప్రజలు ఎవరు కూడా నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు.