మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, మార్చ్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌, బాలింతల కోసం కెసిఆర్‌ కిట్‌, ఆడబిడ్డల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, ఒంటరి మహిళల కోసం ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో మహిళల కోసం అధిక సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.

స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులు ఇతర దేశాలకు తీసుకెళ్లి విక్రయించడం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారని తెలిపారు. మహిళలు వేధింపులకు గురి కాకుండా ప్రభుత్వం షీ టీం లను ఏర్పాటు చేసిందని చెప్పారు. జిల్లా కేంద్రంలో క్యాన్సర్‌ పరీక్షలు చేసే యంత్రం వచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని పేర్కొన్నారు.

జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు.2019 జనవరి నుంచి2020 మార్చి వరకు 14,776 మహిళా సంఘాలకు రూ.44.35 కోట్ల వడ్డీ రాయితీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్పర్సన్‌ ఇందూ ప్రియ, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, డిఆర్‌డిఓ సాయ న్న, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »