కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. రిఫరల్ సెంటర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.