నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెలరోజుల క్రితం ఇందలవాయి మండల కేంద్రంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన పానాటి రాములు, ఆయన భార్య సత్యవా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో ఘటన స్థలంలో మరణించారు. వారితో పాటు వారి కూతురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నపూర్ణకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు తామే భరిస్తామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డాక్టర్కి ఫోన్లో తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో పిల్లల తల్లిదండ్రులు మరణించడం చాలా బాధాకరమైన విషయం, ప్రభుత్వపరంగా పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, దిగులు చెందవద్దని ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.
అనంతరం ఆయన బాధిత పిల్లలకు నిత్యవసరాలకు 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. దిగులు చెందవద్దని ధైర్యంగా ఉండాలని పిల్లలకు ధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, స్థానిక ఎంపీపీ నల్లసారిక హనుమంతు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.