ఆర్మూర్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్ గంగా మోహన్ చక్రు, కన్వీనర్ సురేందర్, కో కన్వీనర్ రాజేష్ తెలిపారు.
పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ రాష్ట్ర సెక్రటరీ పవన్ కుమార్ ఆదేశాల మేరకు జరుపుతున్నామని, టోర్నమెంట్‌కు ఒలంపిక్స్ అధ్యక్ష కార్యదర్శులు పూర్తిస్థాయిలో సహకరించారని కోరారు.
ఆటల పోటీలకు ఆట మైదానము, కోర్టులు సర్వం సన్నద్ధం చేశామని, పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా పది బాలుర జట్లు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. బాలుర జట్లకు ఆల్ ఫోర్స్ పాఠశాలలో వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ గంగా మోహన్ చక్రు, కన్వీనర్ సురేందర్, కోకన్వీనర్ రాజేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సురేష్ పాల్గొన్నారు. వ్యాయమ ఉపాధ్యాయులు రాజేందర్, నగేశ్, శ్యాం, చిన్నయ్య, సురేశ్, రమణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.