కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జి20 ప్రెసిడెన్సీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్‌కు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద అవగాహన కల్పించడానికి గురువారం డిబేట్ కార్యక్రమం నిర్వహించారు. కాడెట్స్‌ను మూడు గ్రూపులుగా విభజించి ఎన్విరాన్మెంట్ మీద వాళ్ల అవగాహన పరీక్షించడానికి డిబేట్ నిర్వహించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసిని కలిగిన ఏకైక ప్రైవేట్ కళాశాల ఆర్కే అని, విద్యార్థులను పరేడ్ శిక్షణతో పాటు సామాజిక స్పృహకల్పించటానికి ప్రభుత్వ ఆదేశానుసారం వివిధ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని, దాంట్లో భాగంగానే డిబేట్ నిర్వహించామని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌కే సిఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, డీన్ నవీన్, ప్రిన్సిపల్స్ సైదయ్య, గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్, ఏవో, ఎన్సిసి ఆఫీసర్ దినేష్, విద్యార్థులు పాల్గొన్నారు.