కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ధరణి టౌన్షిప్ ఫ్రీ బిడ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి చెల్లించాలని తెలిపారు.
వేలంలో పాల్గొనే వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలని చెప్పారు. 44 వ నెంబర్ జాతీయ రహదారి పక్కన రామారెడ్డి రోడ్లు డిటిసిపి లే అవుట్ లో ప్లాట్లు, గృహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో పర్యవేక్షకులు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.