ఎల్లారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డి నందు పాలకవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు ఎగుల నర్సింలు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల జమ ఖర్చులు, దీర్ఘకాలిక కొత్త రుణాలు మంజూరు చేయాలని, పంట రుణమాఫీ ఒకేసారి ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.
సమావేశంలో డైరెక్టర్లు మర్రి సూర్య ప్రకాష్, పార్ధే నారాయణ, పౌలయ్య, ఎంగల బాలరాజు, లంబాడి లక్ష్మణ్, చెన్నంగారి సుఖేంధర్ రెడ్డి, నాగం గోపిక్రిష్ణ, నర్ల నర్సింలు, సిఈఓ విశ్వనాథం, సిబ్బంది పాల్గొన్నారు.