గాంధారి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.
ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిర్యాదు చేసిన వారిలో ఎంపీపీ రాదా బలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, స్థానిక సర్పంచ్ సంజీవ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు శివాజీ రావు, సొసైటీ చైర్మన్ సాయికుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.