పొందుర్తిలో వన్‌ డే వన్‌ బూత్‌ కార్యకమ్రం

కామరెడ్డి, మార్చ్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు.

ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం ప్రతి బూత్‌లో 31 మందితో నూతనంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా ప్రతి బీజేపీ నాయకుడు బూత్‌ స్థాయిలో ఉంటారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ఇచ్చిన గ్రామ స్థాయిలో చేయాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి దారులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాలను వివరించాలని, ప్రతి నెల 4 వ ఆదివారం మోదీ ప్రసంగించే మన్‌ కి బాత్‌ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తప్పని సరిగా విక్షించాలని, ప్రజలు కూడా చూసే విధంగా ప్రయత్నం చేయాలనీ అన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »