మోర్తాడ్, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని సుంకెట్ గ్రామంలో ఆదివారం 15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మోర్తాడ్ ఎంపీపీ శ్రీనివాస్, జడ్పిటిసి రవి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా స్థానిక సర్పంచ్ కడారి శ్రీనివాసులు టెంకాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుంకెట్ గ్రామంలో అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సిసి రోడ్ల నిర్మాణం కొరకు 15 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామప్రజల తరఫున ప్రజా ప్రతినిధుల తరఫున మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డిసిసిబి డైరెక్టర్ భూమన్న, మండల కో ఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, నవీన్ గౌడ్, ఓంకార్, సాయిరాం, మహేష్, సంతోష్ గౌడ్, ప్రశాంత్, బిట్టు, తీగల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.