కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబల్ బెడ్ రూమ్ గృహాల లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగే లక్కీ డ్రాకు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి లక్కీ డ్రాను నిర్వహించాలని చెప్పారు. టేక్రియాల్లో (50), అడ్లూరు, ఇలిచిపూర్‌లో (50), రామేశ్వర్ పల్లి (35), దేవునిపల్లి, లింగాపూర్ (120), కామారెడ్డి అర్బన్ లో 465 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.