కామారెడ్డి, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ షాదాబ్ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, జమీల్ మాట్లాడుతూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం గడిచిన ఆరు నెలల్లోనే 6 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 824 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నపిల్లలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 నుండి 5 వేల మంది వరకు ఉన్నారని వారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా కామారెడ్డి రక్తదాతలు సిద్ధంగా ఉండడం అభినందనీయమని ప్రస్తుతం వేసవికాలం కావడం వల్ల రక్తము లభించడం లేదని మే నెలలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని తలసేమియా చిన్నారుల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని గత 17 సంవత్సరాలుగా రక్తదాతల సహకారంతో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, మేము చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలనుకునేవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్ కి తెలియజేయాలన్నారు.
మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు చందన్, ఏసు గౌడ్ పాల్గొన్నారు.