కామారెడ్డి, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ చంద్రశేఖర్, సర్పంచ్ నాగభూషణం, వైద్యులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.