కామారెడ్డి, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పంపిణి చేశారు.
ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్ 4 ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెల్పడం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు నిరంతరం అందిస్తున్నారన్నారు. దాత సహకారంతో స్టడీ మెటీరియల్ ఉచితంగా పొందిన నిరుద్యోగు అభ్యర్థులు స్టడీ మెటీరియల్‌ను చక్కగా వినియోగించుకుని ఉద్యోగం సాధించాలని కోరారు. అడగగానే స్టడీ మెటీరియల్ అందించిన జైళ్ల శాఖ ఎస్పీ శివకుమార్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో మండల మైనార్టీ ఉపాధ్యక్షులు సలీం, మాజీ వార్డు సభ్యులు పోచయ్య, మురళీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.