రెంజల్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ వారంతపు సంత తైబజార్ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు.
ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అహ్మద్, కార్యదర్శి మహబూబ్ అలీ, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్ల భూమేష్, ఆలయ కమిటీ చైర్మన్ లచ్చవార్ నితిన్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కురుమ సాయిలు, వార్డు సభ్యులు కంఠం గంగారం, సంతోష్, తదితరులు ఉన్నారు.