బాన్సువాడ, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు.
పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ పరీక్షా కేంద్రంలోని రూములు పరిశీలించి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో కల్పించిన ఫర్నిచర్, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రాజా గౌడ్, అధికారులు పాల్గొన్నారు.