ఆర్మూర్, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 16 ను ఆనుకొని ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం, దత్త సాయి ఆలయాలలో గురువారం నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ బాలయోగి మంగి రాములు మహారాజ్ పాల్గొని ప్రతీ గురువారం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించే వంటగదిని ప్రారంభించారు.
కార్యక్రమంలో చేపూర్ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహరాజ్ ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ సభ్యులు గొల్లూరి బాల నర్సయ్య, ఉపసర్పంచ్ నడ్కుడ శ్రీనివాస్, వీడీసి అధ్యక్షులు సొక్కం సంజీవ్ సాయిబాబా, దత్తసాయి ఆలయ కమిటీ అధ్యక్షులు సురేష్ రుక్మాజి, పురోహితులు పారుపల్లి కిరణ్ కుమార్ శర్మ, కిరీటి కుమార్, పారుపల్లి శుభాంకర్ కాశ్యప్, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి బద్దం ప్రవీణ్, కోశాధికారి పోశెట్టి, ప్రత్యేక సలహాదారులు సత్యనారాయణ, సభ్యులు లక్ష్మీనారాయణ, యేసు, ఇందూరు చిన్న సాయన్న, చరణ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పలుగుట్ట కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ మాట్లాడుతూ భగవంతుడు ఎక్కడో లేడని మనుషుల్లోనే నిక్షిప్తమై ఉన్నాడని, మానవతా విలువలు గల ప్రతీ మనిషిలో దేవుడు ఉన్నాడని, అన్ని ధానాల కంటే అన్నదానం గొప్పదని, ఈ అన్నదానానికి, సాయిబాబా ఆలయ అభివృద్ధి కొరకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
కుటుంబంలో ప్రతీ ఒక్కరూ భక్తి భావనలతో భగవంతుని కొలిచిన నాడే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని, మనం సన్మార్గంలో నడిచినప్పుడు భగవంతుడు మన వెంటే ఉంటాడని భక్తులకు వివరించారు. కార్యక్రమంలో చేపూర్ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.