కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో చక్కర కర్మాగారం తెరిపిస్తాం

బోధన్‌, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నిజాం షుగర్‌ కర్మాగారం తెరిపిస్తామని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన హాత్‌ సే హాత్‌ జోడయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం బోధన్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా అంటే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ గుర్తుకు వచ్చేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రలో నిలిచిన ఫ్యాక్టరీని చరిత్రలో పేరు లేకుండా చేశారని అన్నారు.

స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రివర్యులు సుదర్శన్‌ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లాకు మెడికల్‌ కాలేజీ యూనివర్సిటీ అలీ సాగర్‌ ప్రాజెక్టుతో జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తొమ్మిది నెలల్లో ఇప్పుడున్న మంత్రులు ఏమీ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.

ప్రత్యేక తెలంగాణ కోసం 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే జూట మాటలు చెప్పిన కల్వకుంట్ల కుటుంబం పదవులు ఏలుతున్నారని అన్నారు. నాడు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కల్వకుంట్ల కుటుంబం బిచ్చమెత్తుకునేదని హేళన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకం ద్వారా 400 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్లు అందిస్తే నేడు బిజెపి ప్రభుత్వం 1200 రూపాయలు చేసి పేదల రక్తాన్ని పీల్చుకుంటుందని అన్నారు.

బిజెపి ప్రభుత్వం నోట్‌ బంద్‌ చేసిన తర్వాత దేశానికి చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇసుక బియ్యం వ్యాపారం చేస్తూ బిజీగా ఉండి బోధన్‌ను అభివృద్ధి చేయడం మర్చిపోయారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తుందన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి, నాయకులు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, గాలి అనిల్‌ కుమార్‌, మల్లు రవి, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, తహర్‌ బిన్‌ హందాన్‌, కేశ వేణు, పట్టణ అధ్యక్షుడు పాషా మొహీనుద్దిన్‌, గంగాధర్‌ గౌడ్‌, నరేందర్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి, ఖలీమ్‌, దాము నవీన్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »