ఎల్లారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు అందించే 22వ ప్యాకేజీ పనులను, సదాశినగర్ మండలం యాచారం గ్రామంలో టన్నెల పనులు 220 సబ్ స్టేషన్ పనులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో 22 ప్యాకేజ్ పనులు సమీక్ష నిర్వహించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని అధికారుల ఆదేశించారు.
ఏప్రిల్ నెలాఖరు వరకు సబ్ స్టేషన్ పనులు పూర్తి అవుతాయని అన్నారు, 22 ప్యాకేజ్ ద్వారా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతమైన సదాశివ నగర్ రామారెడ్డి గాంధారి తాడువాయి రాజంపేట మండలాలలో 97 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందక వర్ష ద్వారా పంటలు సాగుచేస్తూ బోర్లు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఇటీవల జరిగిన సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి 22 ప్యాకేజీ పనులను పరిశీలించమని ఆదేశించడం జరిగిందని దీనిలో భాగంగానే పనులను పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తన నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందడానికి దృఢ సంకల్పంతో ఉన్నానని ఆయన వివరించారు.
సమావేశంలో కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబ్, సీనియర్ నాయకులు పడిగెల రాజేశ్వరరావు, తానాజీ రావు, ముకుందరావు, శివాజీ రావు, స్థానిక జెడ్పిటిసిలు, ఎంపీపీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.