కేటీఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

రెంజల్‌, మార్చ్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి పిలుపులో భాగంగా టిఎస్పిఎస్సిలో పేపర్స్‌ లీకేజ్‌ జరిగిన ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

సందర్భంగా జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి కార్తీక్‌ యాదవ్‌ మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీలో పేపర్స్‌ లీకేజ్‌ జరిగిన ఘటనపై నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేటీఆర్‌ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని లేనియెడల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలో నిర్వహిస్తామని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు షేక్‌ సద్దాం, రెంజల్‌ మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ లోక కృష్ణ, మండల ఎస్సి సెల్‌ అధ్యక్షులు చిన్నుల రాకేష్‌, నీలా గ్రామ యూత్‌ అధ్యక్షులు గాండ్లు వీరేష్‌, సిద్ధ సాయిలు, అలీముద్దీన్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »