తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

గాంధారి, మార్చ్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర స్ఫూర్తితో తెలంగాణలో నిర్వహిస్తున్న హత్‌ సే హత్‌ సే జోడో పాదయాత్ర గాంధారి మండలంలో ఆదివారం కొనసాగింది. ఈ పాదయాత్రలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ తీరుపై ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గుడిమేట్‌ గ్రామం నుండి గాంధారి మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వరకు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి నడిచారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరసన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో అరాచక, అక్రమ, దోపిడీ పాలన కొనసాగుతుందని అన్నారు. కేవలం కుటుంబ పాలనలో తెలంగాణ బంది అయిందని అన్నారు. ఒక వైపు ఎమ్మెల్యేల కొనుగోలులో వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉంటే, గ్రూప్‌ పేపర్‌ లీకేజిలో కేటీఆర్‌ పాత్ర, మద్యం కుంభకోణంలో కవిత, ఇసుక అమ్మకంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌, మరో కుంభకోణంలో హరీష్‌ రావు ఇలా చెప్పుకుంటూ పొతే ప్రభుత్వం మొత్తం అవినీతిలో కురుకుపోయిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరకుల ధరలు పెంచి పేద ప్రజలపై భారం మోపుతున్నాయని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకీ రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణ మాఫీ, గృహినులకు 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, పేద వారికి స్వంత ఇంటి గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం, పోడుభూముల సమస్యల పరిష్కారం వంటివీ అమలుచేస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని అన్నారు. టీఎస్పిఎస్సి గ్రూప్‌ పేపర్‌ లీకేజిలో మంత్రి కేటీఆర్‌, అతని పిఏ తిరుపతి పాత్ర ఉందని ఆరోపించారు. పేపర్‌ లీకేజి వ్యవహారాన్ని సిబిఐ తో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో అవి కనపడడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడిరదే వాటికోసమని, కానీ ఎక్కడా అవి మచ్చుకు కూడా కనపడడం లేదని అన్నారు. కేవలం కెసిఆర్‌ కుటుంబానికే రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఉద్యోగాలు లేక యువత కష్టాల పలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఎనిమిది నెలలలో తెలంగాణ లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని, నిరుద్యోగులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎల్లారెడ్డి లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, సుభాష్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »