కామారెడ్డి, మార్చ్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు.
37 ప్రభుత్వ, 25 ప్రైవేట్ భవనాలకు రంగులు వేశారని చెప్పారు. ఇంకా 14 ప్రభుత్వ భవనాలు, 30 ప్రైవేట్ భవనాలకు రంగులు వేయాలని అధికారులకు సూచించారు. జూమ్ సమావేశంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, ప్రోగ్రాం అధికారులు శోభారాణి, చంద్రశేఖర్, శిరీష, పద్మజ, చలపతి పాల్గొన్నారు.