కామారెడ్డి, మార్చ్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని 50 ప్లాట్లు, 11 గృహాలు వేలం పాట ద్వారా విక్రయించడం ద్వారా రూ.7.92 కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టరేట్ ఏవో రవీందర్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల వేలం కార్యక్రమానికి మంగళవారం హాజరై మాట్లాడారు.
మంగళవారం 12 ప్లాట్లు, నాలుగు గృహాలు వేలం వేయగా రూ.2.9 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఐదు రోజులపాటు వేలం కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజీవ్ స్వగృహ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, అధికారులు రాందాస్, సాయి భుజంగరావు పాల్గొన్నారు.