కామారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీపై కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, ఎన్‌ఎస్‌యుఐ, యూత్‌ సంఘాలు భగ్గుమన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. పేపర్‌ లీకేజీకి కారకులైన కేటీఆర్‌ మంత్రి పదవి నుండి భర్తరఫ్‌ చేయాలని, అసమర్థ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. అలాగే గ్రూప్‌-1 పేపర్‌ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. కలెక్టర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నేతలు నాయకులు కలెక్టరేట్‌ ముట్టడిలో భాగంగా కలెక్టరేట్‌లోకి తోసుకుని రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ విచ్చేసిన షబ్బీర్‌ అలీ విద్యార్థులను విడిపించి తీసుకెళ్లారు

ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేటీఆర్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 5లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డులపాలు చేసిన కేటీఆర్‌, అయ్య నోటిఫికేషన్‌ ఇస్తాడు కొడుకు లీక్‌ చేస్తాడని అన్నారు.

ఎందరో పేదవాళ్లు కాయ కష్టం చేసి తమ పిల్లలకు పట్టణం పంపించి కోచింగ్‌ సెంటర్లో కోచింగ్లు ఇప్పించి రూపాయి రూపాయి కూడా పెట్టుకున్న డబ్బునంత దారాబోసి ఫీజులు కట్టి పరీక్షలు రాస్తే లీకేజ్‌ పేరుతో వాళ్ళ జీవితల్లో విషం పోసారని, ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు వారి ఆత్మ ఘోష ఊరికే పోదు మీ కుటుంబం మొత్తం ఊచలు లెక్క పెట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వందలాది మంది విద్యార్థుల బలి దానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేడు నిరుద్యోగుల పాలిట కెసిఆర్‌ ప్రభుత్వం శాపంగా మారిందని దయబట్టారు. విద్యార్థులను నిరుద్యోగులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అరకోర నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ఆ నోటిఫికేషన్లను సక్రమంగా నిర్వహించడంలో టీఎస్పీఎస్సీ విఫలమైందన్నారు.

ప్రతి నోటిఫికేషన్‌ హైకోర్టు మెట్టెక్కిందన్నారు. లీకేజీలతో తోటి నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేసిందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే పీఆర్సీ నివేదిక ప్రకారం 2 లక్షల 91 వేల వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్పీఎస్సీలో పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ లీకేజీ అయిన పేపర్‌లని వెంటనే రద్దు చేయాలన్నారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్‌, కార్యదర్శి నైతిక బాధ్యతలు వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సిబిఐకీ అప్పగించి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బొందపెడుతుందని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు చందు, యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ బికనూర్‌ మండల అధ్యక్షుడు భీమ్‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చీమర్ల సుధీర్‌ యువజన నాయకులు రాజశేఖర్‌, పట్టణ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు భరత్‌, సోఫియాన్‌, రాకేష్‌ అశోక్‌, జీవన్‌, సంతోష్‌, కోతి లింగారెడ్డి, రాజేష్‌ రాహుల్‌, వంశీ ,ప్రశాంత్‌ స్వామి, రాజు, శీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »