రెంజల్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బైండ్ల రాజు ప్రారంభించారు.కంటి వెలుగు వైద్యాధికారిణి బండారి కావ్య జ్యోతి ప్రజ్వలన జరిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ… గ్రామంలో 18 ఏళ్లు పైబడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రారంభంలో స్థానిక వైద్యాధికారి వినయ్ కుమార్, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు చింతల శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు విజయ, కళావతి, కంటి వైద్య నిపుణులు రాము, అఖిల, ఆశావర్కర్లు గ్రామస్తులు ఉన్నారు.