పెన్షనర్ల వినూత్న ధర్నా

నిజామాబాద్‌, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా పెండిరగ్లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గోడుగులతో ధర్నా నిర్వహించారు.

ప్రధానంగా పి.అర్‌. సి. కాల పరిమితి ముగిసినందున జూన్‌ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పిఆర్సి కమిటీ నియమించాలని, బకాయి 3 డిఏ లను విడుదల చేయాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమును పటిష్ట పరిచి, నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు, కార్పోరేట్‌ ఆసుపత్రులలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈపీఎస్‌ పెన్షనర్లకు నెలకు రూ. 9 వేలు రూపాయలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. అధిక సంఖ్యలో హాజరైన పెన్షనర్లు గొడుగులతో కొత్త కలెక్టరేట్‌ ఎదుట ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌ మదన్‌ మోహన్‌, జిల్లా నాయకులు సుదర్శన్‌ రాజు, ఈవిఎల్‌ నారాయణ, ముత్తారం నరసింహస్వామి, ఎం.జార్జ్‌, హనుమాన్లు, ప్రసాద్‌ రావు, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, అందే సాయిలు, బేబీ, మేరీ, అద్దంకి హుషాన్‌, బాబా గౌడ్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »