కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు అరికట్టాలని, అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు రైతులకు సబ్సిడీపై సకాలంలో అందించాలని, రైతులకు ఎరువులు ఉచితంగా అందించాలని, వరి ధాన్యం విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పేర్కొన్నారు.
రైతుబంధు డబ్బులు రైతులు వరి ధాన్యం డబ్బులు బ్యాంక్ అధికారులు అప్పు కింద జమ చేసుకోరాదని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు ఉచితంగా ఇస్తున్న కందులు, పెసర్లు, నూనె గింజలను సక్రమంగా పంపిణీ చేయాలని, జొన్నలను మార్కెట్ ధర ఎంఎస్‌పి రేట్‌కు ఎంఎస్‌పి రైతుకు క్వింటాలుకు ఇరవై ఆరు వందల నలభై రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దాని ప్రకారం కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కిషన్ రావు, స్టేట్ హార్టికల్చర్ సెల్ అధ్యక్షులు గంగారెడ్డి, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాస్ తేలు, తుమ్మ బాలకిషన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిసాన్‌మోర్చా మహిపాల్ రెడ్డి, రాధా కిషన్ రెడ్డి, భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, మండలాల కిసాన్ మోర్చా అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.